Posted on జనవరి 21, 2007 by keshavachary
తెలుగులో యిన్ని సైట్లా!!! ఈరోజే చూసాను తేనెగూడు…చాలా బావుంది… యిక పొద్దును చూడందే పొద్దు గడవట్లేదు. కూడలిలో నడవందే మనసాగట్లేదు… యిన్నాళ్ళూ పుస్తకాల్లో తెలుగును వెతికిన ఈ కళ్ళు యిప్పుడిలా కంప్యూటరునే కావలించుకుంటున్నాయి. బ్లాగులను విడిచి క్లాసులకా? యమా బోర్…ఏముందక్కడ? యిక్కడ నాలా ఏదో సంతృప్తి కోసం రాసేవారే కాదు…కొన్ని ప్రయోజనాలనాశించి మాత్రమే రాసేవారూ ఉన్నారు.వారి వ్యాసాల్ని చదువుతున్నప్పుడల్లా నిజంగా ఎంత ఆసక్తి… నాక్కూడా మీలా టపాలమీద టపాలు,టపాలమీద టపాలూ రాసేయాలనుంటుంది కానీ….విషయమూ,కాలమూ రెండూ వెక్కిరించేవే! [...]
Filed under: మనసులో మాట! | Leave a Comment »
Posted on జనవరి 19, 2007 by keshavachary
రాయలసీమను కలుపుకుంటే ప్రత్యేక తెలంగాణాకు మద్దతిస్తారట!!! రాయలసీమ నాయకులు పత్రికల్లో హామీలిచ్చేస్తున్నారు. ఎంత మంచి ఆఫర్! యిప్పుడేం చేద్దాం? కలిపేసుకుందామా???
Filed under: మీకు తెలుసా? | 5 వ్యాఖ్యానాలు »
Posted on జనవరి 12, 2007 by keshavachary
ఆధునిక కాలంలొ (ఆధునికానంతర యుగంలో) సాహిత్యం వల్ల ప్రయోజనమేంటి? సాహిత్యాన్ని అభ్యసించకపోవటం వల్ల వచ్చే నష్టమేంటి?
Filed under: మీకు తెలుసా? | 4 వ్యాఖ్యానాలు »
Posted on జనవరి 10, 2007 by keshavachary
ఎన్నిసార్లు అడిగా నా మాటని నీతో మాట్లాడకూడదని! ఎంతలా తిట్టా నా కళ్ళని నీ వైపు చూడకూడదని! ఎంత బలవంతపెట్టా నా నడకని నీవున్న చోటుకి నడవకూడదని! ఎంత అణిచిపెట్టా నా మనసుని నీమాటల మత్తుల్లో ,నీ చూపుల జల్లుల్లో ,నీ నడకలనాట్యంలో ఆనందాలు వెతుక్కోకుమని! అయినా సరే; నా మౌనం మాట మారుస్తోంది. నా చూపు వెలుతురే నువ్వంటొంది. నా అడుగులు యిక గమ్యమేముంది అంటున్నాయి. పాపం అవి మాత్రం ఏం చేస్తాయ్; పున్నమి నాటి [...]
Filed under: Uncategorized | 1 అభిప్రాయం »
Posted on జనవరి 5, 2007 by keshavachary
Posted on జనవరి 5, 2007 by keshavachary
అందాల జాబిలికి అందరూ చూస్తున్నారని సిగ్గేసి, మబ్బు పరదాల మాటుకెల్లి ముసిముసిగా నవ్వినట్టు.. ముదురు నీలిరంగు చీరకట్టి, ముద్ద బంతిలా నువ్వు నవ్వుతుంటే, అమ్మో చెలీ! నీదెంత అందమే!! యిక ఈ మాట అనక తప్పదు మరి, చీరకు నువ్వందమా! నీకు చీరందమా! ఎవరికెవరందమైనా నిను చుసిన కనులకు మాత్రం ఈ రోజంతా ఆనందమే!..
Filed under: కవితలు | 1 అభిప్రాయం »
Posted on జనవరి 5, 2007 by keshavachary
నాకో అనుమానం. నీ పెదాలు పలికిన ప్రతీ మాట సన్నగా మొదలయి నను తీయగా తాకుతున్నాయి. ఏంటా అని గట్టిగా ఆలోచిస్తే ఆ దేవుడు నీ గొంతులో వీణను దాచి పెదాలపై అమృతముంచాడని అనిపిస్తోంది అంతే కదూ! దొంగా దొరికిపోయావ్….
Filed under: కవితలు | 1 అభిప్రాయం »
Posted on జనవరి 5, 2007 by keshavachary
పట్టు లంగా పరికిణీల్లోనే తలుక్కున మెరిసే నువ్వు పసుపు చీర, మల్లె పూలతో వస్తే యిక ఆ చంద్రుడు వెన్నెలనివ్వడం మానేస్తాడో ఏమో!!!!
Filed under: కవితలు | Leave a Comment »
Posted on జనవరి 5, 2007 by keshavachary
నా ఊహళ్ళో ఊపిరోసుకున్న అందమా విడిపోతానంటూనే పెనవేసుకున్న అనుబంధమా నన్ను ఇన్నాళ్ళూ ఓ తీయని కాల ప్రవాహంలో ముంచేసిన నువ్వు నిజంగానే స్వప్నమా!!
Filed under: కవితలు | Leave a Comment »
Posted on జనవరి 5, 2007 by keshavachary
పట్టు లంగా పరికిణీల్లోనే తలుక్కున మెరిసే నువ్వు పసుపు చీర, మల్లె పూలతో వస్తే యిక ఆ చంద్రుడు వెన్నెలనివ్వడం మానేస్తాడో ఏమో!!!!
Filed under: కవితలు | Leave a Comment »