నా డైరీ మొదటి పేజీ

ఈ రోజంతా ఆనందమే!..

అందాల జాబిలికి అందరూ చూస్తున్నారని సిగ్గేసి, మబ్బు పరదాల మాటుకెల్లి ముసిముసిగా నవ్వినట్టు.. ముదురు నీలిరంగు చీరకట్టి, ముద్ద బంతిలా నువ్వు నవ్వుతుంటే, అమ్మో చెలీ! నీదెంత అందమే!! యిక ఈ మాట అనక తప్పదు మరి, చీరకు నువ్వందమా! నీకు చీరందమా! ఎవరికెవరందమైనా నిను చుసిన కనులకు మాత్రం ఈ రోజంతా ఆనందమే!..

ఇప్పుడు తెలిసింది

నాకో అనుమానం. నీ పెదాలు పలికిన ప్రతీ మాట సన్నగా మొదలయి నను తీయగా తాకుతున్నాయి. ఏంటా అని గట్టిగా ఆలోచిస్తే ఆ దేవుడు నీ గొంతులో వీణను దాచి పెదాలపై అమృతముంచాడని అనిపిస్తోంది అంతే కదూ! దొంగా దొరికిపోయావ్….

నువ్వుండగా జాబిలెందుకు

పట్టు లంగా పరికిణీల్లోనే తలుక్కున మెరిసే నువ్వు పసుపు చీర, మల్లె పూలతో వస్తే యిక ఆ చంద్రుడు వెన్నెలనివ్వడం మానేస్తాడో ఏమో!!!!

తీపి జ్ఞాపకం

నా ఊహళ్ళో ఊపిరోసుకున్న అందమా విడిపోతానంటూనే పెనవేసుకున్న అనుబంధమా నన్ను ఇన్నాళ్ళూ ఓ తీయని కాల ప్రవాహంలో ముంచేసిన నువ్వు నిజంగానే స్వప్నమా!!

నువ్వుండగా జాబిలెందుకు

పట్టు లంగా పరికిణీల్లోనే తలుక్కున మెరిసే నువ్వు పసుపు చీర, మల్లె పూలతో వస్తే యిక ఆ చంద్రుడు వెన్నెలనివ్వడం మానేస్తాడో ఏమో!!!!

నీలా మరొకరు

ఈరోజు మళ్ళీ పొరపడ్డా.. నీ నవ్వు లోని మాధుర్యం, నీ నడకలోని సౌందర్యం, మాటల్లో లాలిత్యం, ఆ చూపుల్లో అమాయకత్వం…. అంతా.. నీవనిపించే నీలా మరొకరు! ఓ క్షణం తీక్షణంగా చూసా, తనను కాదు,నిన్ను తనలో నాకు కనిపించే నిన్ను. అంతే! ఎదలోంచి ఎల్లువలా పొంగిన గతం!! తనకు ఎదురెళ్ళి చూడగానే ఆశ్చర్యం,ఆనందం కలగలిపిన అనుభవం!! అక్కడుంది నీవు కాదు! నీలా అనిపించే కాదు,కనిపించే నీవు కాని మరొకరు….

నీ నవ్వే!!

తొలి సందె కిరణాలు ప్రసరించు సమయాన, హిమబింధు జల్లుల్లో తడిసేటి పుష్పాలు, అవని ఒడినిండా రంగులన్నీ కుంచెతోఅద్దినట్లు, తోటలొని పూలన్నీ చేటంతై విచ్చినప్పుడు, ఏ పువ్వు చూసినా నీ నవ్వే గుర్తుకొచ్చె!!

సన్నజాజి పువ్వా!

మల్లె పూవు లాంటి ఓణీలో సన్నజాజి లా ఉన్న నిన్ను చూడగానే నా మనసు మందారమై వికసించింది. నిజమే కదూ!   ఎందుకో ఈ ఏడాది అంతా బరువుగా గడిచిపొతోంది. నీ తీపి జ్ఞాపకాలతో నిండిపోయింది కాబట్టి! నిజమేనా!!… అందమంతా నీవే నిన్ను చూడక ముందు ఈ లోకమెంతో అందమైందనిపించింది! నిన్ను చూసాక ఈ లోకంలోని అందమంతా నీవేననిపిస్తోంది!!

మల్లెమొగ్గ

ఈ రోజేంటో..! ఆకుపచ్చ ఓణీలో అందంగా వచ్చావ్. వసంత కాలంలో లేత చిగుర్లేసిన మల్లెమొగ్గలా!! నిను చూసిన తర్వాత నీ కళ్ళల్లో నలుపు చూసిన తర్వాత నాకు చీకటి కూడా అందంగా కనిపిస్తోంది! నీ పెదాలపై నవ్వు చూసిన తర్వాత యిక ఈ పువ్వుల్లో ఏముంది అనిపిస్తోంది!! కుశలమా! నే వెళ్ళొస్తూ ఎదురొచ్చిన పిల్ల గాలికి చెప్పా, నిన్నడిగినట్లు చెప్పమని!

Follow

Get every new post delivered to your Inbox.