తెలిస్తే చెప్పండి!

ఆధునిక కాలంలొ (ఆధునికానంతర యుగంలో) సాహిత్యం వల్ల  ప్రయోజనమేంటి?

సాహిత్యాన్ని అభ్యసించకపోవటం వల్ల వచ్చే నష్టమేంటి?

4 స్పందనలు

  1. మంచి సాహిత్యం వ్యక్తిత్వ వికాశానికి దోహదం చేస్తుంది.మానసికానందం ఇస్తుంది.ప్రతీ విషయాన్ని లోతుగా అలోచించగలిగే తత్వాన్ని,ఎటువంటి పరిస్తితులనోనయినా స్తిరం గా నిలబడగలిగే ఆత్మ స్తైర్యానీ ఇస్తుంది.సాహిత్యాన్ని అభ్యశించకపోవడం వల్ల పెద్ద నష్టమేమి లేదు అని నా అభిప్రాయం.మంచి సాహిత్యాన్ని ఆస్వాదించగలిగి,ఆచరించగలిగితే చాలు. [గమనిక...ఇవి అభిప్రాయాలు మాత్రమే అని తెలియచేస్తున్నాను.]

  2. అసలు ఈ ప్రశ్నే విచిత్రంగా ఉంది.ఏ దృష్టితో అడుగుతున్నారో అర్థం కాలేదు.(కెరీర్ దృష్ట్యానా ? మరో దృష్ట్యానా ?)ఒక విషయం మాత్రం చెప్పగలను.అందరికీ గణితశాస్త్రంతో పనిలేనట్లే, అందరికీ ఇంజనీరింగుతో పనిలేనట్లే అందరికీ సాహిత్యంతో కూడా పనిలేదు.సాహిత్యాధ్యయనానికి కావాల్సింది అవసరం కాదు.సంస్కారం.అది ఉన్నవాడు సాహిత్యాన్ని వెతుక్కుంటూ వెళతాడు.లేనివాడు అది నాకెందుకు అని ఎదురుప్రశ్న వేస్తాడు.Man does not live by bread alone. ఒక భాషలోని ఉత్తమ సాహిత్యం మనకి మన కాలాన్ని మన ప్రదేశాన్ని మన వ్యక్తిగతాన్ని అధిగమించి విశ్వమానవులుగా రూపొందడానికి సహకరిస్తుంది. మనం ఎప్పుడూ అనుభవించి యెరుగని అనుభవాల్ని మన పరం చేస్తుంది. మన ఊహశక్తిని వృద్ధిపొందిస్తుంది. మానవ మనస్తత్వం పట్ల విస్తృతమైన అవగాహన కలిగిస్తుంది. మన భావాల్ని మంచి శైలిలో వ్యక్తీకరించడం నేర్పిస్తుంది.

    సాహిత్యం ఆనాడూ ఈనాడూ ఏనాడూ సమాజంలోని చాలా కొద్దిమందికి మాత్రమే ఆసక్తికరమైన విషయంగా ఉంటూ వస్తోంది.అంతమాత్రాన దాని ప్రాధాన్యం తక్కువది కాదు.

  3. సాహిత్యం ఒక పిపాస.
    ఉపయోగం అంటే మానిసికానందం, అలోచనా వికాసం, భావ వ్యక్తీకరణ వంటివి.

  4. please give exact definision of ‘SAHITYAM’ then any body can give exact answeer.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.