తెలుగులో యిన్ని సైట్లా!!!
ఈరోజే చూసాను తేనెగూడు…చాలా బావుంది…
యిక పొద్దును చూడందే పొద్దు గడవట్లేదు. కూడలిలో నడవందే మనసాగట్లేదు…
యిన్నాళ్ళూ పుస్తకాల్లో తెలుగును వెతికిన ఈ కళ్ళు యిప్పుడిలా కంప్యూటరునే కావలించుకుంటున్నాయి. బ్లాగులను విడిచి క్లాసులకా?
యమా బోర్…ఏముందక్కడ?
యిక్కడ నాలా ఏదో సంతృప్తి కోసం రాసేవారే కాదు…కొన్ని ప్రయోజనాలనాశించి మాత్రమే రాసేవారూ ఉన్నారు.వారి వ్యాసాల్ని చదువుతున్నప్పుడల్లా నిజంగా ఎంత ఆసక్తి…
నాక్కూడా మీలా టపాలమీద టపాలు,టపాలమీద టపాలూ రాసేయాలనుంటుంది కానీ….విషయమూ,కాలమూ రెండూ వెక్కిరించేవే!
పోనీలెండి సమయముందిగా యింకా! వీడింకా బడిపిల్లగాడే!
యిక నా సోదలా ఉంచితే…
తెలుగును యిలా నెట్ ప్రపంచంలొ వెలిగేలా చేసిన,చేస్తున్న మేధావులందరికీ అభివందనం!
: నందు ఉంచబడ్డది; మనసులో మాట!

