నేను గమనించినవేంటంటే…

బ్లాగరు మహాశయులారా అందరికీ నమస్కారం!

చాలా రోజులయింది బ్లాగుల్లోకి అడుగు పెట్టి… అన్ని పనులూ ముగించుకుని ఇలా రాయడం మొదలు పెట్టడానికి – సుమారు రెండు నెలలు అయిందనుకుంటా! అయితే కూడలి మాత్రం రోజూ చదువుతూనే ఉన్నా!

 వాదాలూ, వివాదాలూ, వింతలూ, వినోదాలూ అబ్బో చాలానే ఉన్నాయిగా!

ఇన్నాళ్ళూ కేవలం పాఠకునిగా మిగిలాక, చాలా విషయాల్ని  గురించి ఒక మంచి అవగాహన వచ్చింది. అదే మన బ్లాగులూ, బ్లాగర్ల గురించేనండీ! అవేంటో మీతోనే చెప్పేస్తే బాగుంటుందనీ ఇలా మొదలెట్టా!

మన బ్లాగుల్లో ముఖ్యంగా నేను గమనించినవేంటంటే…

(నేను చెప్పబోయేవన్నీ ఖచ్చితమైనవి అనుకోకండి. అన్నింటికీ “అనిపిస్తోంది” అన్నది కలుపుకొని చదవండి.)

కొందరు బ్లాగర్లు ఇంతకు పూర్వం తమ పోస్టులపై వ్యాఖ్యానించిన వారిని దృష్టిలో పెట్టుకుని అవకాశం దొరికినప్పుడు వారి ఆలోచనలను అనాలోచితంగా ఖండిచటం పనిగా పెట్టుకున్నారు. (ఆధారాల విషయం ఎందుకులెండి!  మనందరికీ తెలుసు)

బ్లాగర్లలో వర్గాలూ ఉన్నాయండీ!!!

ఇంట్లో తమ వాళ్ళతో ఆప్యాయంగా గడపాల్సిన సమయాన్ని కాస్తా ఈ బ్లాగులకే వెచ్చిస్తూ అనవసరపు చెత్తంతా రాసే వాళ్ళు ఎక్కువయ్యారు.

అంతా రాసే వాళ్ళే గానీ, ఇతరుల పోస్టులను చదివి వాటిల్లోని వాస్తవాంశాలను గూర్చి ఆలోచించే వారి సంఖ్య తక్కువ!

కూడలిలో కనిపించిన వాళ్ళే కనిపిస్తారు, అంతే కాదండోయ్ వాళ్ళకు వాళ్ళే పొగిడేసుకుంటూంటారు. విషయం లేకపోయినప్పటికీ!

పాఠకులను ఆకర్షించాలనో, మరేదో చేయాలనో పూర్తిగా వ్యక్తిగత విషయాలను రాస్తూ, అందులో అనవసరపు చమత్కారాలు గుప్పిస్తూ, ఏదో ఉత్కంఠ రేపుతున్నామని భ్రమపడిపోయి, తమ ప్రతిభకు తామే మురిసిపోయే కొందరు ఉన్నారనీ… (వీళ్ళు రాసేవి యాత్రా చరిత్రలు, స్వీయానుభవాలు, అనుభూతులు కావు! వ్యాపార నవలల కన్నా ఇంకా ఇంకా హీనమైన ధోరణిలో…)
మంచి పాలు కూడా ఉందండీ!

వీళ్ళు తమ అభిప్రాయాల్ని సాలోచనంగా, నిర్భయంగా బయట పెడతారు. తమపై వచ్చే విమర్శల్ని గురించి కూడా ఆలోచిస్తున్నారు.

సమాజంలోని కట్టుబాట్లు, సిద్ధాంతాలు, ఆచారాలు మొ.న వాటికి పూర్తిగా లోబడిలేరు. వాటిలోని మంచి చెడ్డల్ని సవిమర్శకంగా అలోచిస్తూ పాఠకుల్నీ ఆలోచింపజేస్తున్నారు.(మాతృత్వం, ప్రాంతీయత, పాలన పరమైన అంశాలపై జరిగిన చర్చలను బట్టి.)

చదివించే విధంగా, ఒకవేళ చదివినా మంచి విషయాన్ని తెలుసుకున్నాం అని అనిపించే విధంగా రాసేవాళ్ళూ ఉన్నారు. అయితే వీరి సంఖ్య చాలా చాలా పెరగాలి.

ఇంకా చాలానే ఉన్నాయి గానీ ఇప్పటికివి చాలు.

వీటన్నిటికీ నేను పూర్తిగా అతీతున్ని అని మాత్రం అనుకోకండే!
 

17 స్పందనలు

  1. “పాఠకులను ఆకర్షించాలనో, మరేదో చేయాలనో పూర్తిగా వ్యక్తిగత విషయాలను రాస్తూ, అందులో అనవసరపు చమత్కారాలు గుప్పిస్తూ, ఏదో ఉత్కంఠ రేపుతున్నామని భ్రమపడిపోయి, తమ ప్రతిభకు తామే మురిసిపోయే కొందరు ఉన్నారనీ…”

    మరి ఈ టపా లో నువ్వు చేసిందేంటి????

    క్రియేటివ్ గా ఒక టపా/వ్యాసం రాసి చదివేవాళ్ళను ఆకట్టూకోవటం చాతగాక “వాడు ఇటువంటి వాడు, వీడు అటువంటి వాడు” అని తక్కిన వాళ్ళను విమర్శిస్తూ చీప్ పబ్లిసిటీ కోసం ఎందుకు వెంపర్లాడటం??

    నీకు సొంతంగా రాయటం రాకపోతే వెరే వాళ్ళు రాసింది చదివి ఊరికే కూర్చో..లేక పొతే…మంచి టపా రాయగలిగే దమ్ముంటే, రాసి అందరి దౄష్టి ఆకట్టుకో. ఇంకొకళ్ళను తప్పులు పడుతూ రాస్తే క్యూరియాసిటీ వల్ల చాలమందే చదవొచ్చు. అలాంటి సందర్భాలలో “మన ప్రతిభ వల్లే ఇంత మంది చదివారు” అని ఫీలవ్వటం వల్లనే నీ లాంటి వాళ్ళు ఎక్కువయ్యరు. ఎప్పుడూ “ఇంకోడు ఏమి రాసాడు, దాన్ని ఎలా గెలుకుదామూ” అని చూస్తు కూర్చుంటే నీలాగె తయారౌతారు అందరూ.

    పోనీ ఈ టపా ఐనా ధైర్యంగా రాసావా? “అనిపిస్తుంది అనుకొండి”, “నేనూ ఆతీతుడిని కాను” అని ఎరండు ముక్కలు రాసేస్తే అది ఒక discalimer అయిపొద్దా?

  2. అయ్యో తమ్ముడూ! అంతలోనే ఇంత ఘాటు స్పందనా…

    ఒకవేళ నువ్వు నాకంటే వయసులో పెద్దానివయి ఉన్నా నీ వ్యాఖ్యలు చూసి తమ్ముడు అనే అనాలనిపిస్తుంది.

    చివర్న నేనన్న ఆ మాటలు నా గురించి కాదు నాయనా”నీ అట్లాంటి వాళ్ళ గురించే” ఇదంతా చదివి నాగురించి కాదులే అనుకుంటారు చూడు వాళ్ళ గురించి. నువ్వు నేను చెప్పిన మంచికి అతీతున్ని అనుకున్నట్టున్నావ్! పాపం అందుకే ఇలా!

    ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎవరినితప్పు పట్టలేదు… మంచి చెడులు చూసానంతే! పోనీ తప్పులే చూసాననుకున్నా కింద మంచి కూడా ప్రస్తావించాను కదా! అది కనిపించలేదా తమ్ముడూ!

    తమ్ముడూ… నేను సృజనాత్మక రచనలు చేసే వారిని అనలేదు… బ్రాకెట్స్లో చెప్పాను చూడు. పూర్తిగా వ్యక్తిగత విషయాలు రాసేవారినే అన్నానే…

    అయినాగానీ తమ్ముడూ ఇలా మాట్లాడ్డానికి కూడా తెలివి ఉండాలి. నేను రాసిన మాటల్ని నువ్వు కోడ్ చేసిన దాంట్లోనే “పూర్తిగా వ్యక్తిగత విషయాలు రాస్తూ”అని ఉంది. అవి లేకుండా కాపీ పేస్ట్ చేయకపోయావా… కాస్త అర్థం పర్థం చచ్చేది.

    ((పాఠకులను ఆకర్షించాలనో, మరేదో చేయాలనో పూర్తిగా వ్యక్తిగత విషయాలను రాస్తూ, అందులో అనవసరపు చమత్కారాలు గుప్పిస్తూ, ఏదో ఉత్కంఠ రేపుతున్నామని భ్రమపడిపోయి, తమ ప్రతిభకు తామే మురిసిపోయే కొందరు ఉన్నారనీ… (వీళ్ళు రాసేవి యాత్రా చరిత్రలు, స్వీయానుభవాలు, అనుభూతులు కావు! వ్యాపార నవలల కన్నా ఇంకా ఇంకా హీనమైన ధోరణిలో…)
    మంచి పాలు కూడా ఉందండీ!))

    నీలాంటి వాళ్ళు పదిమంది ఉంటే ఇంట్లో జరిగే పడగ్గది విషయాలు కూడా (కథలాగా కూడా కాకుండా) సృజనాత్మకంగా రాస్తున్నామని అనుకునేవాళ్ళు రాస్తారు. నీ లాంటి వాళ్ళూ తప్పకుండా చదువుతారనుకో. అయినా నీకంత కోపం వచ్చిందంటే నువ్వు ఈ చెత్త రాతలు రాసిన వారిలో ఉండి ఉంటావు.

    వ్యక్తిగతంగా నేను విమర్శించలేదు. నువ్వు అలా ఇప్పుడు చేయించావు.

    అయినా మంచి విమర్శ లేకుంటే సాహిత్యం అంతా వ్యక్తిగత ప్రతిభలకే అంకితమయ్యేది. “కళ సామాజిక ప్రయోజనం కోసం” అన్న వాదన వచ్చేది కాదు. నీకంతగా తెలిసినట్లు లేదు.

    ధైర్యంగా రాయడమంటే అడ్డమైన వెడ్డి పేర్లు పెట్టి నీ చిరునామా ఏదో దొరక్కుండా రాయడం కాదు. రాయడానికి చోటుంది కదా అని ఇష్టమొచ్చినట్లు వాగేయడం కాదు.

    నేను చెప్పిన లక్షణాలు బ్లాగుల్లో లేవని నిరూపిస్తే ఈ పోస్టు తీసివేస్తా…

    చెడుని విమర్శించడం ద్వారా మంచిని వెలుగులోకి తేవడం అన్నది ఉత్తమ పాఠకుని లక్షణం. ఆ పాఠకునివి కావడం పోయి… ఏదో సొల్లు కబుర్లు చెప్పుకునే వాగుడుకాయలా ఉన్నావు అందుకే ఇంత కోపమొచ్చింది.

    నా సృజనాత్మకత గురించి అడుగుతావా… ఎప్పుడయినా పేపర్లు చదివే అలవాటుంటే చూడు నా కవితలు, కథలు… కూడలిలో నాకు పబ్లిసిటా… అయ్యో తమ్ముడూ!

    నువ్వన్నట్టుగానే ఈ టపాలో ఎవరి రచననైనా గెలికానా? చెప్పు??

    చివర్న తేలిందేమంటే ….. చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడింది నువ్వని. మరో సారి ఇలాంటి చెత్త వ్యాఖ్యలు రాసినపుడు నీ బ్లాగు గట్రా చెప్పు నాయినా చూద్దాం. నువ్వెంత ఘటికుడివో!

    (ఊరికే ఏమాత్రం ఆలోచించకుండా పరుషంగా మాట్లాడటానికి మీ అభిప్రాయాలు రాయకండి. ఒకవేళ రాస్తే అది ఎందుకో చెప్పండి.)

  3. విమర్శించటం అంటే కేవలం తిట్టటం, ఖండించటం అని అనుకునే వాళ్ళతోనే ఈ బాధంతా… రెండు వైపులా ఆలోచించటం ప్రధానం. అలాక్కాకుండా ఆవేశం వచ్చిందే తడవుగా ఎడాపెడా వాయించడం కాదు.
    అది తెలియకనే మనవాడు పాపం అలా మాట్లాడాడు.
    రేపు మన బ్లాగుల మీద సమీక్షా సాహిత్యం వచ్చిందనుకున్నాం. అందులో ఇలా కాకుండా ఎలా ఉంటుంది.
    బ్లాగులు ఎలా మొదలయ్యాయి? తర్వాత వాదాలు ఎలా ఆరంభమయ్యాయి? అసలు అందులో సాహిత్యం ఉందా? ఉంటే వాటి విలువలు ఏంటీ? ఇవేగా ప్రశ్నలు…
    అందులో మంచి రచయితల ప్రస్తావన ఉంటుంది. అలాగే పేలవమైన రచనల ఖండన కూడా ఉంటుంది. ఇది తప్పనిసరి.
    విమర్శను జీర్ణించుకోలేని వాళ్ళే ఎక్కువగా ఉంటే బ్లాగు సాహిత్యం సమీక్ష స్థాయికి ఎదగలేదనీ, ఒకవేళ ఎవరయినా సమీక్ష రాయడానికి ప్రయత్నిస్తే వారిది వృథా శ్రమ అనీ అనుకోవాల్సిందే!
    (బ్లాగు సాహిత్యంపై పరిశోధనలు జరగాలనుకున్నాను. ఆ భ్రమలు తొలిగాయ్!!)

  4. అయినా కేశవాచారి గారూ,
    ఈ బ్లాగునూ ఇక మంచి చెడ్డల ఛట్రంలో ఇరికిస్తే బ్లాగెవరు రాస్తారండీ. మనం రాసేది ఎవరికి నచ్చుతుందో తెలియక, ఏ పత్రిక వాడూ వేసుకోక, మనలో మనం వుంచుకోలేక కదా వుమ్మేసేది. ఇక ఇక్కడా ఇది బ్లాగకూడదు, ఇలా బ్లాగకూడదు, ఈ విశయం బ్లాగకూడదు (మీరలా అనలేదనుకోండి, అయినా ఆ అర్థం వస్తోంది) అంటే అది బ్లాగెందుకవుతుంది?

    నా మట్టుకు నాకు బ్లాగంటే చదివే వాడి ఇష్టం కోసం కాక నా ఇష్టం కోసం రాసేది. ఇష్టపడేవాడు పడతాడు పడని వాడు పడడు.

    అయినా బ్లాగరులంతా సమాజంలోంచి వచ్చిన వారేగా. అందులో వున్న అన్ని రకాల మనుషులూ ఇందులోనూ వుంటారు అందులో ఆశ్చర్యం లేదు.

    – ప్రసాద్
    http://blog.charasala.com

  5. కేశవా! ఎందుకయ్యా అంత బాధపడిపోతావు. వదిలేయి. అంత పెద్ద స్పందనిచ్చి మన నోరూ, టైమూ ఎందుకు పాడుచేసుకోవడం. The comment doesnot deserve it. టపా వ్రాస్తే ఏ రియాక్షన్ కన్నా సిద్ధపడే వ్రాయాలి. ఇప్పటికే ఈరకంగా కామెంట్లు వ్రాశేవాళ్ళు కూడా ఉంటారని తెలిసుండాలే. ప్రసాదుగారన్నట్లు బ్లాగంటే చదివే వాడి ఇష్టం కోసం కాక వ్రాసేవాడి ఇష్టం కోసం రాసేది. నాకైతే నీ టపాలో వ్రాసినది సబబుగా అనిపించింది. ఎవరో ఒకరు ఇలాంటి సమీక్షలు చేస్తూంటే అలాంటి దోషాలేమైనా ఉంటే బ్లాగర్లు తొలగించుకోవచ్చు. ఏటొచ్చీ సమీక్షల్లో వ్యక్తిగత విమర్శలు ఉండకుండా సమీక్షకులు జాగ్రత్త పడాలి. తొలడుగులోనే భ్రమలు తొలగడమేమిటీ- నడవాల్సినదంతా ముందే ఉంది.

  6. ok leav it. inkaa mrinni samiikshalu raayi kesav veelaite konni mamchi pustakaala gurimchi kudaa.

  7. ప్రసాదుగారూ, సత్య సాయిగారూ! వివరంగా మీ అభిప్రాయాల్ని చెప్పారు. నేను కోరుకునేది కూడా అదే. ఇలాంటి వ్యాఖ్యలే – అది ఏ అంశం పైనయినా కావచ్చు – అవి రాసిన వారిని పునరాలోచించుకునేలా చేస్తాయి.

    స్వేచ్ఛనే బ్లాగుల పరమావధి అని చెప్పారు. అయినప్పటికీ కొన్ని పరిధులు అవసరం. అవి రచయితల్లో ప్రమాణాలు పెంచడానికే! ఎంత స్వేచ్ఛగా రాసుకున్నా ఇతరులు చూట్టానికేగా కూడలిలో పెట్టేది. అప్పుడు పాఠకునికీ కాస్త ప్రయోజనం ఉండాలనేది నా అభిప్రాయం.

    ప్రసాదుగారన్నట్టు సమాజంలో రక రకాల మషులుంటారు అలాగే బ్లాగుల్లోనూ ఉన్నారు. ప్రతీ రచనా ఎంతో కొంత మందికైనా నచ్చుతుంది అని అనుకుంటే మళ్లీ నేననేది ఒకటే మాట “పాఠకుల్లోనూ ప్రమాణాలు పెరగాలి, వారి అభిరుచిలోనూ ఉన్నతత్వం వికసించాలి”.

    ఏదేమైనా మీ సానుకూల స్పందనకి కృతజ్ఞతలు. శరత్‌కి కూడా!

  8. అన్నా
    “నా మట్టుకు నాకు బ్లాగంటే చదివే వాడి ఇష్టం కోసం కాక నా ఇష్టం కోసం రాసేది. ఇష్టపడేవాడు పడతాడు పడని వాడు పడడు.” ఇది నిజమేనా? ఒకడి బ్లాగు ఇంకొకడు చూస్తాడు అని తెలిసినప్పుడు రాసేవాడు ఒక ముసుగు వేసుకుని మంచి మాటలే రాయటానికో లేక పేరు ప్రఖ్యాతులు సంపాదించటానికో వెంపర్లాడతాడు కదా?

  9. చాలా అర్ధవంతమైన చర్చ ఇది. రాశిలేనిదే వాసి రాదు. దేన్లోనైనా 80-90 శాతం వరకూ ఉండేది చెత్తే. వాసిలేకపోతే దీర్ఘకాలంలో మనలేవు ఎక్కువమంది ఆ బ్లాగులను ఆదరించరు. ఇలా వేల బ్లాగులేసి చిలుకుతేనే కానీ కొన్ని మేలిమి బ్లాగులు వెన్నలా పైకి తేలవు. ఇక బ్లాగులకు ప్రమాణాలు పైనించి మనం వాటిపై రుద్దటం బ్లాగు పునాదిని కదిలించటం లాంటిదే. బ్లాగుల సంఖ్య పేరిగేకొద్ది కూడలిలో పెట్టేందుకు అర్హతలు పెంచాలి కానీ బ్లాగు ప్రారంభానికి, రాయటానికి నిబంధనలు పెట్టకూదని నా అభిప్రాయం. అప్పుడు కూడలిలో తిరష్కరించబడిన వారు అంతగా కావాలంటే వాళ్లందరూ కలిసి సొంత కూడలి ప్రారంభిచుకుంటారు. లేదంటే లైటు తీసుకుంటారు. ఒక ప్రత్యేక వర్గానికి చెందిన బ్లాగర్లు వాళ్ల వాళ్ల అభిరుచులతగ్గట్టు కూడలులు ప్రారంభించుకుంటారు (ఉదాహరణకు: కవితాకూడలి, ప్రత్యేక తెలంగాణ కూడలి, సినిమా కూడలి, అమెరికా కూడలి..ఇలా). అలా జరుతుంది సహజసిద్ధమైన పరిణామం.

    చాలా మటుకు విషయాలు వాటికై అవే నియంత్రిచుకుంటాయి..కాకపోతే ఆ మధ్యలో మనం ఇలా కంగారు పడుతుంటాం (ఉదాహరణలు: మార్కెటు, ప్రకృతి ఇంకా చాలా)

  10. స్వేచ్ఛ బ్లాగుల పరమావధి. అందువల్ల (తెలుగులో) ఎటువంటి బ్లాగులు వచ్చినా ఫరవాలేదు అని నా అభిప్రాయం. ఇతరులను ఉద్దేశించినటువంటి ఈ టపా మీకు శోభను ఇవ్వదు. “తెలుగు సాహిత్య వేదిక” పేరుతో మీరు చేస్తున్న కృషి అభినందనీయం.

  11. నాగరాజు గారూ! నేనెవరినీ ఉద్దేశించి రాయలేదు. బ్లాగులన్నింటినీ ఒకే దృక్పథంతో చూసానంతే. మీరు మొదట ఆ సచిన్ అన్నమాటే అంటున్నారు. వేరే వారిని ఉద్దేశించి రాస్తే వచ్చే శోభ నాకు అక్కర్లేదు…
    ఇక తెలుగు సాహిత్య వేదిక గురించి మీ అభినందనలకి కృతజ్ఞున్ని… అయితే ఇది నా ఒక్కని కృషి కాదు. మా ఈ ప్రయత్నానికి తొలి ప్రేరణ మా గురువుగారు డా. దార్ల వెంకటేశ్వరరావు గారు. పాత్రధారిని మాత్రం నేను…

  12. స్వేచ్ఛనే బ్లాగుల పరమావధి.
    మంచి విమర్శ లేకుంటే సాహిత్యం అంతా వ్యక్తిగత ప్రతిభలకే అంకితమయ్యేది. “కళ సామాజిక ప్రయోజనం కోసం” అన్న వాదన వచ్చేది కాదు.
    రాసేది ఎవరికి నచ్చుతుందో తెలియక, ఏ పత్రిక వాడూ వేసుకోక, ఇక ఇక్కడా ఇది బ్లాగకూడదు, ఇలా బ్లాగకూడదు, ఈ విశయం బ్లాగకూడదు అంటే అది బ్లాగెందుకవుతుంది?
    బ్లాగంటే చదివే వాడి ఇష్టం కోసం కాక నా ఇష్టం కోసం రాసేది. ఇష్టపడేవాడు పడతాడు పడని వాడు పడడు.
    చాలా మటుకు విషయాలు వాటికై అవే నియంత్రిచుకుంటాయి.
    కదా?

  13. మీకు బ్లాగు అనే పదార్ధం సరిగా అర్ధం అయినట్లు లేదు. బ్లాగులు గ్రంధాలు రాసెయ్యటానికో, లేదా అద్భుత సాహిత్య నిక్షిప్తానికో పుట్టలేదు. అంతులేని స్వేచ్చ (ఎదటి వారి స్వేచ్చకు అడ్డులేకుండా) ను వ్యక్తీకరంచటానికి కనుక్కున్న మాధ్యమం బ్లాగు. దానికి మరలా అది రాయాలి, ఇది ఎందుకు అని అవధులు విధిస్తే సూర్యుడు వేడిగా వున్నాడని నిందించటమే అవుతుంది. మీ గురువు గారి బ్లాగు చూసాను. అతను దానిని తన కవితల డాక్యుమెంటేషన్ కు మాత్రం వాడుకున్నారు. అది బ్లాగే కాదు లెక్క ప్రకారం.ఇలాంటి బ్లాగులు అర్ధాంతరంగా పక్క ఎక్కి ముసుగేస్తాయి. రాయటానికి ఏమీ లేక.

  14. నేను మిమ్మల్ని తక్కువచేసి మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించగలరు.

  15. రాసేయ్యవోయ్ రవికుమార్! నీ ఇష్టం ఉన్నట్టు రాసేయ్… బ్లాగంటే అపరిమితమైన స్వేఛ్ఛను వ్యక్తీకరించడం అనే బ్రహ్మాండ బద్దలయ్యే రహస్యం నువ్వు చెప్పాకే నాకు అర్థమయ్యింది. కానీ, నువ్వు మాట్లాడిన పద్ధతి ఏం బాలేదు… నేను ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించానా??? మా గురువుగారి ప్రస్తావన ఎందుకు తెచ్చావ్? ఆయనను విమర్శించడానికి నీకున్న స్థాయి ఏంటి? అసలు అనవసరంగా ఆ ప్రస్తావన ఎందుకు??? అసలు ఆయన బ్లాగు ఏం చదివావ్? నీకేం అర్థమయింది? మా గురువుగారు నేను చెప్పిన విషయాల్నిపూర్తిగా అంగీకరిస్తూ బ్లాగుల్లో ఎక్కడయినా వ్యాఖ్యానించారా? అసలు నువ్వేం చూసావ్?
    నాకు చాలా చిరాగ్గా, అసహనంగా ఉంది. అయితే మీలాగే అర్థం పర్థం లేకుండా మాట్లాడలేను…
    నేనెవర్నీ ఇలా రాయండి అని ఖచ్చితంగా చెప్పలేదు.
    ఇదే విషయాన్ని చెబుతూ మళ్ళీ మళ్ళీ స్పందించడం నాకు అంతగా నచ్చట్లేదు. మధ్య మధ్య ఇలా చిరాకెత్తించే వ్యాఖ్యలు…
    అందుకే అసలు నేనేం చెప్పానో, దానిలోని అంతరార్థమేంటొ వివరిస్తూ ఒక పోస్టు రాస్తాను… అంతవరకూ…

  16. నీ అసహనం,సంస్కారం “నీ” అని వాడినప్పుడే అర్ధం అయ్యింది. వయసు మళ్లితే చాధస్తం పెరుగుతుందిలే “నీ” తప్పులేదు. ఇక్కడ స్థాయిలు చూసుకుంటే ఆసలు బ్లాగర్ల గురించి విమర్శించటానికి, వ్యాఖ్యానించటానికి నీ అర్హత ఏమిటి? బ్లాగుల ప్రపంచంలో నీ వయస్సు అసలు ఎంత? రెండు పోష్టులు రాయగానే పుడింగువయిపోతే నేనంత పుడింగునవ్వాలి? నేను నా ఆంగ్ల బ్లాగును ఆరు సంవత్సరాలుగా రాస్తున్నాను, ఇతర బ్లాగులు చదువుతున్నాను. కాబట్టి నాకు నీకు చెప్పే అర్హత వుంది తమ్ముడు (అలా అనాలనిపిస్తుంది నీ కంటే వయస్సులో నేను చిన్నయినా).

    ఇక డా.వెంకటేశ్వరరావు గారి గురించి. నా వ్యాఖ్య చదువు, నేనెమైనా అతనిని లేశమాత్రమైనా నిందించానా? లేదే? అతనిని అనవసరంగా నువ్వే నీ అహం దెబ్బతినటం వలన ఇందులోనికి లాక్కొచ్చావు. ఆ మాత్రాన అతని గౌరవం ఏమి చెడదు.

    ముందర బ్లాగులు అర్ధం చేసుకుని అప్పుడు మొదలు పెట్టు బ్లాగు సాహిత్యంపై పరిశోధన. డాక్టరేటు వస్తుంది.

  17. నా వయసు 23 సంవత్సరాలు… అహం దెబ్బతిని మాట్లాడేంత వయసు, అనుభవం నాకు లేవు. “నీ” అనడంతోనే నా సంస్కారం తెలుసుకుంటే అంతకంటే ఆనందం మరొకటి లేదు. విషయం పూర్తిగా పక్కదారి పట్టింది. మళ్ళీ “నువ్వే” చదువు “నీ” “నా” వ్యాఖ్యల్ని. “మీ గురువు గారి బ్లాగు చూసాను. అతను దానిని తన కవితల డాక్యుమెంటేషన్ కు మాత్రం వాడుకున్నారు. అది బ్లాగే కాదు లెక్క ప్రకారం.ఇలాంటి బ్లాగులు అర్ధాంతరంగా పక్క ఎక్కి ముసుగేస్తాయి. రాయటానికి ఏమీ లేక.”
    అంటే ఒక్క “మీ” అన్న పదం (మీ ప్రకారం సంస్కార బోధకమైన పదం) ఉపయోగించి వ్యక్తిగతంగా ఎలాగైనా అనొచ్చన్నమాట! ఈ మాటల్లో “నీకు” లేశ మాత్రంగానైనా నిందార్థం కనిపించకపోవడం “నీకు” మాత్రమే సాధ్యమైన సంస్కారయుత ప్రయోగం (“నీ” దృష్టిలో).
    “నువ్వు” 6 సం.లుగా రాస్తున్నా బ్లాగు అన్నప్పుడు “నాకు” ఖడ్గం సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. “30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్”(ఇండస్ట్రీ). మళ్ళీ “నువ్వు” ఇదంతా చదివి తిడుతూ రాసావనుకో …నేను కూడా రాస్తా మరోటి. ఎందుకిదంతా.
    “నేను” ఇదే చెప్పాను అనవసర దూషణలున్నాయని. ఇప్పుడదే జరిగింది. ఇది బ్లాగు లోకానికి పూర్తిగా అనవసరం. “నీ” “నా” ఇద్దరి వ్యాఖ్యలు నిజంగా చెత్త…
    ఇక దయచేసి ఆపండి. కావలిస్తే “మిమ్మల్ని” అంటాను. ఏమైనా తప్పులుంటే సర్దుకుంటాను. ఇంకా తప్పు లుంటే వెనక్కి (అలాంటి వ్యాఖ్యల్ని) తీసుకుంటాను. కానీ, నా టపాకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను.

ప్రత్యుత్తరమిమ్ము